e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home జనగాం కేసీఆర్‌ కాలనీగా మార్చాలి

కేసీఆర్‌ కాలనీగా మార్చాలి

కేసీఆర్‌ కాలనీగా మార్చాలి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కోరిన గరీబ్‌నగర్‌ కాలనీ ప్రజలు
నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే
గరీబ్‌నగర్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ

గీసుగొండ, ఏప్రిల్‌ 13 : గరీబ్‌నగర్‌ కాలనీకి కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేస్తామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్‌ పరిధిలోని పోతురాజుపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పార్కు, మహిళా కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గరీబ్‌నగర్‌ కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ 40ఏండ్ల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. ఈ కాలనీకి కేసీఆర్‌ కాలనీగా పేరు పెట్టాలని స్థానికులు కోరడంతో పేరును మార్చేందుకు నివేదికను తయారు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు పేద ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రతి పేదవాడి కష్టం తన కష్టంగా భావించి అండగా నిలుస్తున్నారని అన్నారు. పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. విలీన గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతు బంధు, బీమా ఎందుకు ఇవ్వడం లేదని ఆ పార్టీల నాయకులను ప్రశ్నించారు. కరోనాతో కొలువులు పోయి ఇబ్బందిపడుతున్న ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2వేల నగదు, 25కిలోల బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలతో పాటు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు తప్పకుండా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, జడ్పీటీసీ ధర్మారావు, కుడా డైరెక్టర్‌ వీరగోని రాజుకుమార్‌, నాయకులు సుంకరి శివ, గోపాల నవీన్‌రాజు, చెక్క రమేశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గుర్రం రఘు, ఎలుకుర్తి సర్పంచ్‌ జైపాల్‌రెడ్డి, మొగిలిచర్ల సొసైటీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ బాలయ్య, నాయకులు రాజు, బాబూరావు, వీరమల్లు, లాల్‌రాజు,నర్సయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌

టిబెట్ స‌రిహ‌ద్దుల్లో 5 జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న చైనా

కొత్త రోగాలు వ‌స్తాయి.. వ‌న్య‌ప్రాణుల అమ్మ‌కాల‌ను ఆపండి: డ‌బ్ల్యూహెచ్‌వో

పుకార్ల‌పై స్పందించిన జెర్సీ డైరెక్ట‌ర్..!

Advertisement
కేసీఆర్‌ కాలనీగా మార్చాలి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement