గురువారం 04 మార్చి 2021
Jagityal - Jan 22, 2021 , 01:24:15

కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

హుజూరాబాద్‌టౌన్‌, జనవరి 21: కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో భాగంగా నాలుగో రోజు గురువారం హుజూరాబాద్‌ సబ్‌ డివిజన్‌లో 135 మంది వైద్య సిబ్బందికి టీకాలు వేసినట్లు ఉపవైద్యాధికారి జువేరియా తెలిపారు. హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో నలుగురు పురుషులు, 11 మంది స్త్రీలు, చెల్పూర్‌ పీహెచ్‌సీలో ఒక పురుషుడు, 11 మంది మహిళా సిబ్బంది, వావిలాల పీహెచ్‌సీలో ఐదుగురు పురుషులు, 15 మంది స్త్రీలు, సైదాపూర్‌లో 33 మంది పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, శంకరపట్నంలో ఇద్దరు పురుషులు, 53 మంది మహిళా వైద్యులు, సిబ్బందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపారు. టీకా వేసుకున్న వారిని గంటసేపు అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు. ఎవరికీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

సైదాపూర్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో గురువారం 33మంది అంగన్‌వాడీ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి పర్హానా ఫాతిమా, సూపర్‌వైజర్‌ సమ్మయ్య తెలిపారు. టీకాలు వేసిన తర్వాత వారిని గంటసేపు అబ్జర్వేషన్‌లో ఉంచి ఎటువంటి సమస్య లేకపోవడంతో అందరినీ ఇంటికి పంపించామన్నారు. 

తిమ్మాపూర్‌, జనవరి 21 : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం కొనసాగుతున్నది. గురువారం 40 మంది వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కరోనా టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఇందు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo