Monkey Man | ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మంకీ మ్యాన్’
Monkey Man | ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు దేవ్ పటేల్. ఈ సినిమా అనంతరం వరుసగా హాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మంకీ మ్యాన్.
Monkey Man | ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు దేవ్ పటేల్. ఈ సినిమా అనంతరం వరుసగా హాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మంకీ మ్యాన్. ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటించింది. హనుమంతుడి స్ఫూర్తితో వచ్చిన ఈ చిత్రం మార్చి 11న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్‌లో విడుదల కాకపోవడం విశేషం. ఇక ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి గుడ్ న్యూస్ అందిస్తూ తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలలో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. యాతనా అనే ఫిక్షనల్ సిటీలో ఈ కథ జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉండే ఒక యువకుడు (దేవ్ పటేల్) రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. అయితే అతడు ఎవరు అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ దగ్గర హత్యాచారానికి గురవుతున్న ఓ అమ్మాయిని అతడు కాపాడుతాడు. దీంతో హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి వైరం ఏర్పడుతుంది. అయితే ఆ హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

