బుధవారం 25 నవంబర్ 2020
Jagityal - Oct 31, 2020 , 00:55:59

రైతు సంక్షేమానికి పెద్దపీట

రైతు సంక్షేమానికి పెద్దపీట

ప్రతి గింజనూ కొంటాం  

అన్నదాతలు ఇబ్బందిపడొద్దనే మక్కల కొనుగోళ్లు

రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

పలు గ్రామాల్లో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మెట్‌పల్లి/మెట్‌పల్లి రూరల్‌/ ఇబ్రహీంపట్నం: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ భరోసా ఇచ్చారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని, అనంతరం మెట్‌పల్లి మార్కెట్‌ యార్డులో వరి, మక్కల కొనుగోలు కేంద్రాన్ని,  మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌లో ఐకేపీ, విట్టంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాలను  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మ ద్దతు ధర అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంతో రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బందులు తప్పవని, దళారి వ్యవస్థను ప్రోత్సాహించే విధంగా ఉందని విమర్శించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.  సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, అడగకముందే వరాలిచ్చే దేవుడని రైతుల కష్టాసుఖాలు తెలిసిన వ్యక్తిగా ఎవరు అడగకున్నా మక్కజొన్న పంటకు రూ. 100 పెంచి మద్దతు ధర రూ. 1850 చెల్లించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా మక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.  రైతుల ముసుగులో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. కాగా మంత్రి రాత్రి ఎనిమిది గంటల దాకా వివిధ గ్రా మాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారం భించారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌ గుగులోత్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం, జిల్లా వ్యవసాయాధికారి సురేశ్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా ఎండీ దివ్యభారతీ, మార్కెటింగ్‌శాఖ డీఎం ప్రకాశ్‌, ఆర్డీవో వినోద్‌కుమార్‌, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకటరావు, మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజా త, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, డీసీవో రా మానుజం, డీఆర్డీవో పీడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, మారు సాయిరెడ్డి, జడ్పీటీసీలు కంటం భారతి, రాధ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు జంగ ద్యావతి సరస్వతి, జరుపుల భారతి, వైస్‌ చైర్మన్‌ పూదరి సుధాకర్‌ గౌడ్‌, సర్పంచ్‌ నేమూరి లత, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు ఎలాల దశరథరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు పొనకంటి వెంకట్‌, తహసీల్దార్లు స్వర్ణ, రాజేశ్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచులు బద్దం శేఖర్‌, ఆకుల రాజరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు కేశిరెడ్డి నవీన్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం విమోచన,సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.