మంగళవారం 20 అక్టోబర్ 2020
Jagityal - Jul 02, 2020 , 03:41:10

వృక్ష సంపదతోనే మానవ మనుగడ

వృక్ష సంపదతోనే మానవ మనుగడ

  • n జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు
  • n కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో చేపట్టిన హరితహారానికి హాజరు

కోరుట్ల టౌన్: వృక్ష సంపదతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. పట్టణ శివారు కావేరి గార్డెన్ నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన హరితహారంలో ఆయ న పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రయోగాత్మకంగా వివరించారు. మున్సిపల్ పరిధిలో 4,51,625 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ పేర్కొన్నారు. ఇంటింటికీ నాలుగు మొక్కలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ మేనేజర్ తన్నీరు రమేశ్, ఇంజినీర్ సాయిప్రణీత్, టీపీవో శ్రీధర్, సినియర్ అసిస్టెంట్ కొండపల్కల సతీశ్‌రావు, శ్రీధర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, టీఎంసీ జలంధర్ తదితరులు పాల్గొన్నారు.   

మెట్‌పల్లి టౌన్:  పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి, భావితరాల మనుగడ కోసం మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, డీఎం విజయారావు, మున్సిపల్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఎఫ్‌ఆర్వో రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్ అంగడి పురుషోత్తం, టీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణ, మాధవరెడ్డి, ఆనంద్‌రావు, ప్రణయ్, ఉపేందర్, నాగ న్న, కృష్ణభూపాల్, రాజగోపాల్ పాల్గొన్నారు.logo