Chaddannam | ‘పెద్దల మాట.. చద్దన్నం మూట’.. ఈ మాట తాతల నాటిది. చద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో సూచించేది. ‘చద్దన్నం (Chaddannam) తిన్నందుకే ఇంత సత్తువతోని ఉన్నం’ అని పెద్దలు చెప్తుంటారు. మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతి ప్రవేశంతో పాతతరం ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.
పూర్వం రాత్రి మిగిలిన అన్నాన్ని చద్ది అన్నంగా మార్చుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంజుకుని పొద్దున్నే తినేటోళ్లు. పూర్వం అంతా ఇదే పద్ధతిని పాటించేవారు. ఇప్పుడు అంతా ఇడ్లీ, దోశ, వడ అంటూ టిఫిన్స్వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు చద్దన్నం అన్నమాటే వినిపించడం లేదు. గ్రామాల్లో సైతం ఉదయం టిఫిన్స్నే తింటున్నారు.
కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని చాలామందిని మళ్లీ పాత అలవాట్లవైపు తిప్పింది. గ్రామాల్లో అక్కడక్కడ కనిపించే ఈ చద్దన్నం సంస్కృతి ఇప్పుడు నగరాలకు పాకింది. సద్దన్నంలో రోగనిరోధక శక్తి ఉంటుందని నిపుణులు సూచించడంతో ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్‌లో కూడా సద్దన్నం చేరిపోయింది. ఒకప్పుడు సద్ది అన్నాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. రాత్రి మిగిలినదానిని పొద్దున తినడం నామోషీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు చద్దన్నంలో గొప్ప పోషకాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రజలు ఉదయం లేవగానే దాన్నే తింటున్నారు. రోగ నిరోధనక శక్తిని పెంపొందించడంలో దీనికి మించిన ఫుడ్ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఈ చద్దన్నానికి గిరాకీ పెరిగింది.
మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్‌ఫాస్ట్‌కు యమా క్రేజ్ (Yama craze) వచ్చింది. అమెరికా (America)లో అయితే ఈ చద్దన్నాన్ని రూ.వేలు పెట్టి కొనుగోలు చేసి మరీ తింటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓ స్టోర్‌లో చద్దన్నం దాదాపు రూ.వెయ్యికి అమ్ముతున్నారు. ఇది చూసిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వీడియో తీసి ‘కలికాలం అంటే ఇదేనేమో’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చద్దన్నంకి ఉన్న క్రేజ్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
రాత్రి మిగిల్చిన అన్నాన్ని ఒక మట్టి పాత్ర లేదా స్టీల్ గిన్నెలో వేయాలి. దాంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తరువాత కొన్ని గోరువెచ్చని పాలు పోయాలి. తోడుగా పెరుగు జత చేయాలి. దాంట్లో నాలుగైదు పచ్చి మిరపకాయలు తరిగి వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు, కొంచం ఉప్పు వేసి కలియబెట్టాలి. ఆ తరువాత మూత బెట్టి వదిలేయాలి. అలా రాత్రంతా ఆ అన్నం పులిసిపోయి చద్దన్నంగా మారిపోతుంది. ఉదయం ఆ అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.
Also Read..
Zomato | పెట్రోల్ దొరకలేదు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. VIDEO
YS Sharmila ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న షర్మిల
Arvind Kejriwal | ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా