Arvind Kejriwal | ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి డుమ్మా కొట్టారు.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి డుమ్మా కొట్టారు. ఈ మేరకు విచారణకు హాజరుకావడం లేదని ఈడీ అధికారులకు కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు.
మద్యం కుంభకోణం (excise policy) కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 3న (బుధవారం) కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాజాగా తాను విచారణకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన సీఎం.. ముచ్చటగా మూడోసారి కూడా డుమ్మా కొట్టారు.
మరోవైపు ఈడీ సమన్లపై ఆప్ (AAP) తీవ్రంగా స్పందించింది. ఈ నోటీసులు అక్రమమని, తమ సుప్రిమోను అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అయితే, దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారు..? అని ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నోటీసులు పంపారని ఆరోపించింది.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను ప్రశ్నించింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. అక్టోబర్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 2న రెండోసారి సమన్లు పంపింది. ఈ రెండుసార్లు సైతం ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానన్న ఆయన.. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈ క్రమంలో ఈడీ మూడోసారి నోటీసులు పంపింది. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదంటూ సమాచారం ఇచ్చారు.
Also Read..
YS Sharmila | నేడు ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న షర్మిల
Coronavirus | 24 గంటల్లో 602 కొత్త కేసులు.. ఐదు మరణాలు
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

