Zomato | ‘హిట్ అండ్ రన్’ కొత్త చట్టం ( hit-and-run law) ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ యాక్ట్‌కు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు (truck drivers) సమ్మెకు దిగడంతో పెట్రోల్, డీజిల్ దొరక్క జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల (Petrol Pumps) ముందు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఇంధనం దొరకని పరిస్థితి. దీంతో ప్రజలు విసుగుచెందుతున్నారు.
ఈ క్రమంలో జొమాటో (Zomato)కు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పెట్రోల్ కోసం నానా పాట్లు పడ్డాడు. సుమారు నాలుగు గంటలకు పైనే క్యూలో ఓపిగ్గా నిల్చున్నాడు. అయినా పెట్రోల్ దొరకలేదు. దీంతో విసుగుచెందిన అతడు.. తన వాహనాన్ని పక్కన పెట్టి అశ్వాన్ని ఆశ్రయించాడు. నగర రోడ్లపై గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ చంచల్‌గూడ (Chanchalguda) పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రం మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను విపరీతరంగా ఆకట్టుకుంటోంది.
When petrol bunks ran out of fuel in #Hyderabad, @zomato delivery arrived on horseback … at Chanchalguda, next to Imperial Hotel… after long, long queues & closure of petrol pumps as a fallout of #TruckersStrike over #NewLaw on hit-and-run accidents @ndtv @ndtvindia pic.twitter.com/bYLT5BuvQh
— Uma Sudhir (@umasudhir) January 3, 2024
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్ ’ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో ఇంధన సరఫరాలో కొరత ఏర్పడుతుందన్న భయంతో ప్రజలు పెట్రోల్ బంక్‌ల వద్దకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిచ్చాయి. కొన్ని బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ పరిణామంతో నగరం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. కొన్ని గంటల వ్యవధిలోనే నగర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్‌లతో అట్టుడికిపోయాయి. నిమిషాల వ్యవధిలో చేరాల్సిన గమ్యానికి వాహనదారులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాశారు.
Also Read..
Arvind Kejriwal | ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా
Coronavirus | 24 గంటల్లో 602 కొత్త కేసులు.. ఐదు మరణాలు