Pak & Afghan | పాకిస్థాన్‌తో సహా ఎవరినీ ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫియాజ్ హమీద్ గత వారం తాలిబన్ల నేత ముల్లా అబ్దుల్ ఘనీ బారాదర్ను కాబూల్‌లో కలుసుకున్నారు. యుద్ధభూమిగా మారిన ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో భాగంగానే బారాదర్ను ఐఎస్ఐ చీఫ్ కలుసుకున్నారని వార్తలు వచ్చాయి.
దీంతో ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో పాక్ జోక్యం చేసుకుంటుందా? అన్న సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాక్ సహా ఏ దేశం కూడా జోక్యం చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత కాబూల్‌లో పర్యటించిన విదేశీ ఉన్నతాధికారి పాక్ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫియాజ్ హమీద్ కావడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!