తాతిరెడ్డి మేఘన కాంతిప్రియకు హెచ్‌సీయూ నుండి నాలుగు బంగారు పతకాలు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన జాతీయ మానవ, జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి తాతిరెడ్డి గోవిందరెడ్డి, ధనలక్ష్మి దంపతుల కుమార్తె తాతిరెడ్డి మేఘక కాంతిప్రియ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నాలుగు బంగారు పతకాలు అందుకుని...
బూర్గంపహాడ్, అక్టోబర్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన జాతీయ మానవ, జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధి తాతిరెడ్డి గోవిందరెడ్డి, ధనలక్ష్మి దంపతుల కుమార్తె తాతిరెడ్డి మేఘక కాంతిప్రియ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నాలుగు బంగారు పతకాలు అందుకుని అరుదైన ఘనత సాధించారు. ఆంత్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె అత్యుత్తమ విద్యాప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలవడంతో యూనివర్సిటీ పీజీ టాపర్ మెడల్, ప్రొఫెసర్ ఎల్ కె.మూర్తి మెడల్, ఫిజికల్ అండ్ ఆర్కియాలజికల్ ఆంత్రోపాలజీ, అలుమ్ని మెడల్ ఫర్ సోషల్ ఆంత్రోపాలజీ, లేట్నంపల్లి అశోక్‌కుమార్ మెడల్, ఫీల్డ్ వర్క్ డిసర్టేషన్లను ఆమె అందుకున్నారు. ఆంత్రోపాలజీలో మాస్టర్స్ చదువుతున్న సమయంలో మేఘన కాంతిప్రియ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ జనరేషనల్ చేంజస్ అనే అంశంపై పరిశోధన నిర్వహించి విద్య, సమాజం, తరాల మధ్య చోటుచేసుకునే మార్పులను అధ్యయనం చేస్తూ ఫీల్డ్ వర్క్ ఆధారంగా పరిశోధన చేపట్టారు.
యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ, స్నాతకోత్సవ ముఖ్య అతిధి, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ సమీర్వి, కామత్ తదితర ప్రముఖుల సమక్షంలో మేఘన కాంతిప్రియ ఈ బంగారు పతకాలను అందుకుంది. తల్లిదండ్రులు, గురువుల ద్వారా నేర్చుకున్న విలువలు, నైతికతతో పాటు తాను అభ్యసించిన విద్యను సమాజ శ్రేయస్సుకు వినియోగించడమే తన ప్రధాన లక్ష్యమని మేఘన కాంతిప్రియ తెలిపారు. మేఘన కాంతిప్రియ నాలుగు బంగారు పతకాలు సాధించడం పట్ల మండలానికి చెందిన పలువురు ప్రముఖులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

తాతిరెడ్డి మేఘన కాంతిప్రియకు హెచ్‌సీయూ నుండి నాలుగు బంగారు పతకాలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

