Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
Ola vs Tesla | ఓలా ఈ-స్కూటర్ 2022లో అమెరికా మార్కెట్‌ను తాకనున్నది. భారత్‌లోకి టెస్లా రాకముందే ఇది జరుగుతుందా? అని సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది.

Ola vs Tesla | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా మధ్య పరుగు పందెం ప్రారంభమైందా.. అంటే అవుననే అనిపిస్తున్నది. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు గత నెల 15వ తేదీన ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలో ఆవిష్కరించారు. ముందే బుకింగ్స్ చేసుకున్న వారికి ఈ నెల నుంచి డెలివరీ ప్రారంభించనున్నది ఓలా ఎలక్ట్రిక్. ఎస్ 1, ఎస్ 1 ప్రో పేరిట ఆవిష్కృతమైన ఈ రెండు స్కూటర్లు దేశీయంగానూ.. ప్రపంచ వ్యాప్తంగా బోల్డు పాపులారిటీ సంపాదించుకున్నాయి.

ఓలా స్కూటర్ ఎగుమతిపై ఇలా
దేశీయ మార్కెట్లో విక్రయించడంతోపాటు విదేశాలకు.. ప్రత్యేకించి అమెరికాకూ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగుమతి చేయబోతున్నది ఓలా ఎలక్ట్రిక్. అమెరికాకు ఈ-స్కూటర్లను ఎగుమతి చేస్తామని సోషల్ మీడియా వేదికగా భవిష్ అగర్వాల్ ప్రకటించారు. భారత మార్కెట్లోకి టెస్లా కార్లు ప్రవేశించడానికి ముందే ఓలా స్కూటర్.. అమెరికా మార్కెట్‌ను తాకుతుందా? అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.

టెస్లా ఆఫ్ స్కూటర్స్ అంటూ..
అమెరికాకు ఓలా స్కూటర్‌ను ఎగుమతి చేస్తామన్న భవిష్ అగర్వాల్ ప్రకటనపై విక్రం వాద్వా అమెరికా పారిశ్రామికవేత్త స్పందించారు.. ఓలా స్కూటర్ వార్త లింక్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. గంటకు 112 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ ధర కేవలం సైకిల్‌తో సమానం అని ఇది అద్భుతం అని పేర్కొన్నారు. ఇది టెస్లా ఆఫ్ స్కూటర్స్ అని అభివర్ణించారు. సిలికాన్ వ్యాలీలో తాము ఈ స్కూటర్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై భవిష్ అగర్వాల్ స్పందిస్తూ.. 2022 ప్రారంభంలో అమెరికాకు స్కూటర్లను ఎగుమతి చేస్తామని రిప్లై ఇచ్చారు.

టెస్లా రాక మరింత జాప్యమా..
నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రెండో అర్థ భాగంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు రావాల్సి ఉంది. కానీ పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు ఎక్కువగా ఉండటంతో ఆ కంపెనీ వెనుకడుగు వేసింది. సుంకాలను తగ్గించాలని ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ చేసిన అభ్యర్థనను కేంద్రం పరిశీలిస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే వచ్చే ఏడాది నాటికి టెస్లా కారు.. దేశీయ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
రిలయన్స్‌కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

