రిలయన్స్‌కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
రికార్డుల ర్యాలీ | గతవారం స్టాక్ మార్కెట్లలో టాప్-10 కంపెనీల్లో తొమ్మిది భారీగా లబ్ధి పొందాయి. వాటి ఎం-క్యాప్ రూ.2,93,804.34 కోట్లు పెరిగింది.

ముంబై: గతవారం ఈక్విటీల ట్రేడింగ్‌లో రికార్డులు బద్ధలయ్యాయి. టాప్-10 కంపెనీల్లో తొమ్మిది సంస్థలు భారీగా లబ్ధి పొందాయి. ఇన్ఫోసిస్ మినహా మిగతా తొమ్మిది దిగ్గజాల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,93,804.34 కోట్లు పెరిగింది. వీటిలో మార్కెట్ లీడర్ రిలయన్స్ అత్యధిక బెనిఫిషియర్‌గా నిలిచింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.02,382 కోట్లు పెరిగి రూ.15,14,017.50 కోట్ల వద్ద స్థిర పడింది. అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ పొందిన తొలి సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఇక రిలయన్స్ స్క్రిప్ట్ గతవారం ఒక శాతానికి పైగా లబ్ధి పొందింది.
రూ.44 వేల కోట్లు పెరిగిన టీసీఎస్ ఎం- క్యాప్
తర్వాత స్థానంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,832.5 కోట్లు పెరిగి రూ.14,20,935.10 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ విలువ రూ.35,342.16 కోట్లు ఎక్కువై రూ.3,61,540.16 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.33,906.91 కోట్లు పెరిగి రూ.4,54,207.76 కోట్ల వద్ద సెటిలైంది.
హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ ఇలా
ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.20,712.29 కోట్లు పెరిగి రూ.6,49,943.93 కోట్లకు దూసుకెళ్లింది. ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ రూ.17,373.55 కోట్లు లబ్ధి పొందడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,02,232.46 కోట్ల వద్ద ముగిసింది.
ఇలా ఎస్బీఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంకుల దూకుడు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.17,001.38 కోట్లు పెరిగి.. దాని విలువ రూ.3,85,007.74 కోట్ల వద్దకు చేరుకుంది. మరో ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14,954.74 కోట్లు పెంచుకుని రూ.8,72,362.42 కోట్ల వద్ద స్థిర పడింది. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.7,298.81 కోట్లు ఎక్కువై రూ.4,98,290.05 కోట్లకు దూసుకెళ్లింది.
ఇన్ఫీ ఎం-క్యాప్ ఇలా డౌన్
మరోవైపు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,457.12 కోట్లు తగ్గి రూ.7,21,244.78 కోట్లకు పడిపోయింది. గత వారం మార్కెట్ ముగిసిన తర్వాత టాప్-10లో రిలయన్స్ కొనసాగుతున్నది. తర్వాతీ జాబితాలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ కొనసాగుతున్నాయి.
ఇక గతవారం బీఎస్ఈ-30 షేర్స్ ఇండెక్స్ సెన్సెక్స్ 3.57 శాతం లేదా 2005.23 పాయింట్లు పెరిగింది. గత శుక్రవారం 58 వేల మార్క్‌కు చేరుకున్నది. నెల రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ తొమ్మిది శాతానికి పైగా పెరగడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

