కారేపల్లి, అక్టోబర్ 01 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్న తమ్మిశెట్టి శ్రీనివాస్‌ను కారేపల్లి కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి ఆధ్వర్యంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పలువురు ప్రముఖులు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లెల రవీందర్, శాంతినగర్ కళాశాల ప్రిన్సిపల్ గోవిందరావు, చర్ల ప్రిన్సిపల్ నరేందర్, టిగ్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీపీ గణేష్, టేకులపల్లి ప్రిన్సిపాల్ పవన్, జిల్లా హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు శేషు ప్రసాద్ పాల్గొన్నారు.