Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh)ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం (India) కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దేశ దిగుమతులపై న్యూ ఢిల్లీ పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలపై మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తాజాగా స్పందించింది. భారత్‌తో ఉన్న అన్ని అపరిష్కృత వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపింది.
ఈ మేరకు బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ (Sheikh Bashiruddin) విలేకరులతో మాట్లాడుతూ.. వాణిజ్య ఆంక్షలపై భారత ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపారు. ‘భారతదేశం తీసుకున్న చర్యల గురించి మాకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. న్యూ ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. ఏవైనా సమస్యలు ఉంటే ఇరుపక్షాలు చర్చించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి’ అని అన్నారు.
కాగా, గత నెలలో భారత్ నుంచి వచ్చే సరకులపై బంగ్లా ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిస్పందనగా.. బంగ్లాదేశ్ నుంచి దిగుమతులపై న్యూఢిల్లీ ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్‌కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్‌లోకి అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్, వంటి వాటిని ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. దాదాపు ఐదు వారాల క్రితం ట్రాన్స్షిప్మెంట్ అవగాహనను భారత్ రద్దు చేసింది. దీనివల్ల ఇతర దేశాలకు భారత్ గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది.
Also Read..
Earthquake | అప్ఘానిస్థాన్‌ను వణికించిన భూకంపం.. చైనా, మయన్మార్, టిబెట్‌లోనూ
Bomb Blast | బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి
Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్