US Strikes | ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న యెమెన్ (Yemen) తిరుగుబాటు దళం హౌతీల (Houthis)పై అమెరికా శనివారం భీకర దాడి (US Strikes) చేసింది. యెమెన్ రాజధాని సనాలోని హౌతీల స్థావరాలపై యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది పౌరులు ఉన్నట్లు తెలిసింది. వీరిలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. అమెరికా దాడులతో సనా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో అందరూ భూకంపం వచ్చిందని భయాందోళన చెందారు.
ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ‘హౌతీల టైం అయిపోయింది. ఈ రోజు నుంచి మీ దాడులు ఆగిపోవాలి. లేదంటే.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా నరకం చూస్తారు’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. అదేవిధంగా ఇరాన్ (Iran) ను కూడా అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. హౌతీలకు మద్దతు తక్షణం ఆపాలని హెచ్చరిక జారీ చేశారు. హౌతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Also Read..
Terrorist | లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం
Amit Shah | వందేమాతరాన్ని ఆలపించిన ఏడేళ్ల చిన్నారి.. గిటార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన అమిత్ షా
Padma Awards | పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం