వాషింగ్టన్: హెచ్-1బీ వీసా (H1B Visa) ఫీజు పెంపు అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. సాఫ్ట్వేర్ కంపెనీలతోపాటు వైద్యరంగానికి భారం కానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తవడంతో ఆయన కార్యవర్గం కాస్త వెనక్కి తగ్గింది. కొత్త వీసాలకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలంటూ ప్రకటించింది. తాజాగా వీసా పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు విదేశీ వైద్యులే ఆధారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫిజీషియన్ వర్క్ఫోర్సలో అంతర్జాతీయ డ్రాడ్యుయేట్లే కీలకమని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) ప్రెసిడెంట్ బాబీ ముక్కామల తెలిపారు. అందువల్ల వైద్య నిపుణుల నియామకానికి హెచ్1బీ వీసాలపైనే ఆరోగ్య సంస్థలు ఆధారపడ్డాయన్నారు. మయో క్లినిక్, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రిసెర్చ్ హాస్పిటల్ వంటి ప్రముఖ సంస్థలకు విదేశీ డాక్టర్లే ఆధారమని నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీసా ఫీజు పెంపు వల్ల వైద్య సిబ్బంది కొరత తీవ్రమవుతుందని ఆరోగ్య సంస్థలు హెచ్చరించాయి.
ప్రతిభావంతులకు గాలం.. అమెరికా కఠిన నిబంధనలతో నిపుణులను ఆకర్షిస్తున్న ఇతర దేశాలు
అమెరికా సంస్థలకూ ట్రంప్ సెగ!.. హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో ఏటా రూ.1.24 లక్షల కోట్ల భారం