Greenland | గ్రీన్లాండ్ (Greenland) స్వాధీనం కోసం అమెరికా (America) వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రణాళికలను రచించాలని జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (జేఎస్ఓసీ)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ టీమ్ ఇందుకోసం ఓ బిల్లును తీసుకొచ్చింది.
రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీ ఫైన్ ‘గ్రీన్లాండ్ విలీనం – రాష్ట్ర హోదా’ (Greenlands Annexation And Statehood) పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ‘గ్రీన్లాండ్ విలీనం-రాష్ట్ర హోదా చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు నేను గర్వపడుతున్నాను. ఈ బిల్లుతో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది’ అని రాండీ ఫైన్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అమెరికా ప్రత్యర్థులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వెల్లడించారు.
Also Read..
Love Insurance: లవ్ ఇన్సూరెన్స్ పాలసీతో జాక్‌పాట్ కొట్టేసిన చైనీస్ మహిళ
Ayatollah Ali Khamenei | మోసపూరిత చర్యలను ఆపండి.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Canada: 2 కోట్ల డాలర్ల ఖరీదైన బంగారం చోరీ కేసు.. టొరంటో ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్టు