టొరంటో: కెనడా(Canada)లో జరిగిన అతిపెద్ద బంగారం చోరీ కేసులో పోలీసులు ఓ కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రాజెక్టు 24తో సంబంధం ఉన్న ఆ వ్యక్తిని పీల్ రీజియన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 మిలియన్ల డాలర్ల ఖరీదైన బంగారం కడ్డీల చోరీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీల్ రీజినల్ పోలీస్ వెబ్సైటలో ఆ అరెస్టు గురించి వివరించారు. 43 ఏళ్ల అర్సలన్ చౌదరీని టొరంటో పీయర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. అతను దుబాయ్ నుంచి వచ్చాడు. చౌదరీకి ఫిక్స్డ్ అడ్రస్ ఉండదన్నారు. సుమారు 5వేల డాలర్ల ప్రాపర్టీని అతను అక్రమంగా కలిగి ఉన్నట్లు ఆ కేసులో ఫిర్యాదు చేశారు. నేరాలు, కుట్రలకు అతను పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2023 ఏప్రిల్ 17వ తేదీన జూరిచ్ నుంచి టొరంటోకు ఓ విమానం వచ్చింది, దాని కార్గోలో సుమారు 400 కిలోల 0.9999 స్వచ్ఛమైన బంగారం ఉన్నది. అంటే 6600 కడ్డీలకు సమానం, వాటి విలువ సుమారు 20 మిలియన్ల డాలర్లు. ఎయిర్‌పోర్టు ప్రాపర్టీ అని చెబతూ షిప్‌మెంట్‌ను దించేశారు. ఆ తర్వాత అది అదృశ్యమైనట్లు తెలిసింది.
ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు. 33 ఏళ్ల సిమ్రన్ ప్రీత్ పనేసర్ కూడా ఉన్నాడు. గతంలో సిమ్రన్ ఎయిర్ కెనడాలో ఉద్యోగిగా పనిచేశాడు. భారత్‌కు చెందిన పనేసర్ కార్గో మళ్లింపుకు సహకరించినట్ల ఆరోపణలు ఉన్నాయి. అతన్ని అప్పగించాలని కెనడా ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టుకున్నది. ఈ కేసులో 36 ఏళ్ల ప్రశాంత్ పరమలింగం కూడా ఉన్నాడు. నిందితుడు అర్చిత్ గ్రోవర్‌ను 2024 మే నెలలో అరెస్టు చేశారు. పర్మపాల్ సింధు, అమిత్ జలోటా, అమ్మద్ చౌదరీ, అలలీ రాజా, ప్రశాంత్ పరమలింగం ఇప్పటికే కస్టడీలో ఉన్నారు.