Deportation | తాను గెలిస్తే అక్రమ వలసదారులను (illegal immigrants) దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత్ సహా పలు దేశాలకు చెందిన వారిని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. అయితే, తరలింపు సమయంలో డిపోర్టీల (Deportation) పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై తవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డిపోర్టీల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో తరలించడం పట్ల.. భారత్ సహా పలు దేశాలు అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు.
ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4
— The White House (@WhiteHouse) February 18, 2025
ఈ నేపథ్యంలో తాజాగా వైట్ హౌస్ (White House) షేర్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో అగ్రరాజ్యం అధికారులు వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తూ కనిపించారు. అనంతరం వారిని విమానంలోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై ట్రంప్ సర్కార్లో కీలకంగా వ్యవహరిస్తున్న టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సైతం స్పందించారు. ‘వావ్’ అంటూ వీడియోని రీపోర్ట్ చేశారు.
Haha wow 🧌🏅 https://t.co/PXFXpiGU0U
— Elon Musk (@elonmusk) February 18, 2025
కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఇటీవలే స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. మూడు సైనిక విమానాల్లో మొత్తం 332 మంది అక్రమవలసదారులను స్వదేశానికి పంపింది. తొలుత 104 మంది స్వదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఈ నెల 15న 116 మందితో రెండో విమానం, 16 తేదీన 112 మందితో మూడో విమానం అమృత్సర్లో ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో డిపోర్టీల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు ఉన్నాయి.
Also Read..
“Deportation | కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు.. డిపోర్టీలపై మారని అమెరికా తీరు”
“Deportation: అమెరికాకు సమీపంలో అమృత్సర్.. పంజాబ్ సీఎంకు బీజేపీ కౌంటర్”
“Deportation | రాత్రి 10 గంటలకు అమృత్సర్కు అక్రమ వలసదారుల విమానం.. ఈసారి ఎంతమంది వస్తున్నారంటే?”