న్యూఢిల్లీ: అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి(Deportation) పంపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ విమానం పంజాబ్‌కు ఫిబ్రవరి 5వ తేదీన చేరుకున్నది. ఇవాళ రాత్రి మరో డిపోర్ట్ వ్యక్తులతో కూడిన విమానం రానున్నది. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ .. కేంద్రంపై విమర్శలు చేశారు. అక్రమ వలసదారులు పంజాబ్ నుంచి వెళ్లినట్లు మాత్రమే చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వైఖరిని ఆయన ఖండించారు.
పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఆర్పీ సింగ్ తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. అమెరికా నుంచి భారత్‌లో ప్రవేశించే అంతర్జాతీయ విమానాలకు.. అమృత్సర్ విమానాశ్రయమే అతి సమీపంగా ఉంటుందని చురక అంటించారు. అందుకే అక్రమ వలసదారులతో వస్తున్న విమానం అమృత్‌సర్‌లో దిగుతున్నట్లు విమర్శించారు. సమస్యను రాజకీయం చేయవద్దు అని, అవగాహనారాహిత్యంతో కుట్రలు పన్నరాదన్నారు.
చాలామంది యువత అక్రమ రీతిలో అమెరికా వెళ్తున్నారు. అయితే వాళ్లను బోర్డర్ వద్ద పట్టేస్తున్నారు. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా డిపోర్ట్ అయినవారిలో ఉన్నారు. లక్షలు ఖర్చు చేసి అక్రమరీతిలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ప్రస్తుతం అగ్రరాజ్యం డిపోర్ట్ చేస్తున్నది.
Amritsar is the closest international airport for flights entering India from the USA. That’s why the US plane carrying illegal immigrants is landing there. Stop politicizing the issue and promoting conspiracy theories due to your lack of knowledge. @BhagwantMann.
— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) February 15, 2025