Drone Strike | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. తాజాగా రష్యా (Russia) నియంత్రణలోని ఖేర్సన్ (Kherson) అనే ప్రాంతంలో ఉక్రెయిన్ భీకర దాడులు చేసింది. నూతన సంవత్సర వేడుకల (New Year party)పై డ్రోన్లతో విరుచుకుపడింది (Drone Strike). ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఖేర్సన్ రీజియన్‌లోని నల్ల సముద్రం తీరంలో ఉన్న ఖోర్లీ గ్రామంలో గల కేఫ్ అండ్ హోటల్‌ను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో దాడిచేసింది. ఆ సమయంలో అక్కడ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అదే అదునుగా ఉక్రెయిన్ దాడికి దిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో వెల్లడించారు. ఈ మేరకు దాడిని తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు.
Also Read..
Cigarette and Beedi Costlier | పెరుగనున్న సిగరెట్టు, బీడీ, పాన్ మసాలా ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్