మాస్కో: రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. భారీ డ్రోన్ల దాడిలో 40కు పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ అధికారులు తెలిపారు. (Russian aircrafts downed) అయితే రష్యా దీనిపై స్పందించలేదు. ఆదివారం రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతంలో ఉన్న కీలకమైన ఒలెన్యా వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. టీయూ-95, టీయూ-22 వంటి వ్యూహాత్మక బాంబర్లతో సహా 40కు పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (ఎస్‌బీయూ) అధికారులు తెలిపారు. రష్యా ఎయిర్‌బేస్ నుంచి దట్టంగా ఎగిసిన పొగలు, వార్ ప్లేన్స్ ధ్వంసమైన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, రష్యాకు చెందిన కీలకమైన వ్యూహాత్మక ఎయిర్ బేస్‌లలో ఒలెన్యా ఒకటి. అణ్వాయుధాలను మోసుకెళ్లగల యుద్ధ విమానాలను ఇక్కడ మోహరించినట్లు తెలుస్తున్నది. అయితే తమ ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడిని రష్యా ఇంకా ధృవీకరించలేదు. ఈ దాడిలో ఎంత ప్రాణ నష్టం జరిగిందో అన్నది కూడా తెలియలేదు.
One of Ukraine’s most successful strikes deep inside Russia might be happening right now. New footage reportedly shows Olenya Air Base with Russian Tu-bombers burning after drone hits. More visuals are surfacing—this looks really big. pic.twitter.com/WEyibKvOUA
— NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) June 1, 2025
Also Read: