రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే పలు పట్టణాలపై రష్యన్ దళాలు బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో బాంబు పేలినప్పుడు వేగంగా దూసుకొచ్చిన ఒక ఇనుప ముక్క.. ఒక పదహారేళ్ల యువకుడి శరీరంలో దిగబడింది. అయితే ఆ సమయంలో అతని జేబులో ఉన్న ఉక్రెయిన్ పాస్‌పోర్టు ఆ కుర్రాడి ప్రాణాలు కాపాడింది.
ఈ ఘటన ఉక్రెయిన్‌లోని మారిపోల్ ప్రాంతంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది. పదునైన ఇనుప వస్తువు పాస్‌పోర్టులో దిగబడటంతో పదహారేళ్ల యువకుడికి ప్రాణాపాయం తప్పినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సదరు కుర్రాడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని, వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేస్తున్నారని పేర్కొంది.
ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు ఆ కుర్రాడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు రష్యా చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం.. రష్యా ఒక ఉగ్రవాద దేశమని, తమ దేశంపై చేసిన దాడిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఎన్నటికీ రష్యాను క్షమించబోమని తేల్చిచెప్పారు.
A piece of shrapnel stuck in Ukrainian passport. It saved life of the 16 year boy. The boy is in surgery now. Shelling of the city continues.
📍Mariupol, Ukraine, 1 March 2022 pic.twitter.com/gIRyuHZKjI
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 2, 2022