అమరావతి : పల్నాడు(Palnadu) జిల్లా గురజాల నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండే తంగెడ గ్రామంలో బాంబుల దాడుల (Bomb attacks) తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది . వైసీపీ(YCP), టీడీపీ(TDP) వర్గీయుల మధ్య ఒక్క ఓటు విషయంలో జరిగిన వివాదం ఉదయం నుంచి స్వల్ప ఉద్రిక్తలకు దారితీసింది.
సాయంత్రం పోలింగ్ 6 గంటలకు ముగిసిన తరువాత గ్రామంలో రెండు వర్గాలు పెట్రోలు(Petrol bombs), నాటు బాంబులతో ఇళ్లపై దాడి చేసుకున్నారు. దీంతో పలు నివాసపు ఇండ్లు,వాహనాలు దగ్దమయ్యాయి. ఈ దాడులో 10 మందికి పైగా తీవ్రగాయాలయినట్లు సమాచారం . ఘటనా విషయం తెలుసుకున్న పోలీసులు అదనపు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మాచర్ల, గురజాల నియోజకవర్గంలో ఉదయం నుంచే ఘర్షణలు జరిగాయి.