డెహ్రాడూన్ : ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. శీతాకాల సీజన్లో మూసివేసిన ఆలయాన్ని 6 నెలల తర్వాత ఆదివారం తిరిగి ప్రారంభించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో అక్షయ తృతీయ సందర్భంగా పూజలు చేసి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. బద్రీనాథ్ ఆలయ దర్శనం కోసం శనివారం సాయంత్రం వరకు ఆన్లైన్లో 7.37 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.