Ukraine | ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా విరుచుకుపడుతోంది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శత్రు దేశం నుంచి వస్తున్న డ్రోన్లను కూల్చేందుకు సైన్యం ప్రమేయం లేకుండా కొంత నగదు ఇచ్చి వాలంటీర్లను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద శత్రుదేశ డ్రోన్లను గుర్తించి, నేలకూల్చే (Shoot Down Russian Drones) పౌరులకు నెలకు సుమారు రూ. 2.2 లక్షల వరకు జీతం అందించనున్నట్లు వెల్లడించింది.
ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తారాస్ మెల్నిచుక్ టెలిగ్రామ్లో ప్రకటించారు. ఈ పథకం కింద, ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లను, డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కలిగిన పారామిలిటరీ సభ్యులను నియమించనున్నారు. వీరు మానవరహిత విమానాలు, ఆయుధాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రష్యా డ్రోన్లను పసిగట్టి, వాటిని కూల్చివేయాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే ఖర్చును స్థానిక బడ్జెట్ నుంచి కేటాయించనున్నారు. మార్షల్ లా ఉండే రెండేళ్ల వరకు ఈ పథకం కొనసాగుతుందని ఉక్రెయిన్ వార్తా సంస్థ కీవ్ వెల్లడించింది.
Also Read..
ICE Protesters | షికాగోలో ఐస్ వ్యతిరేక ఆందోళనలు.. నిరసనకారులపైకి దూసుకెళ్లిన కారు.. VIDEO
Muhammad Yunus | హసీనాను అడ్డుకోమని ప్రధాని మోదీని కోరా.. కానీ : మహమ్మద్ యూనస్