Muhammad Yunus | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉంటూ సోషల్ మీడియా వేదికగా (online speeches) బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనా (Sheikh Hasina)ను కట్టడి చేయాలని ప్రధాని మోదీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించలేదని చెప్పారు. లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది బంగ్లాలో (Bangladesh) రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. భారత్ నుంచే సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించినట్లు యూనస్ తాజాగా వెల్లడించారు.
బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో తాను షేక్ హసీనా అంశంపై చర్చించినట్లు యూనస్ తెలిపారు. ‘షేక్ హసీనా ఆన్లైన్ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దాని వల్ల బంగ్లా ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరాను. ఆమె ప్రకటనలు, ప్రసంగాలను అడ్డుకోవాలని చెప్పాను. అయితే, అందుకు మోదీ అంగీకరించలేదు. ‘అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అంటూ సమాధానం చెప్పారు’ అని యూనస్ వెల్లడించారు.
Also Read..
China visa free | చైనా కీలక నిర్ణయం.. 55 దేశాల ప్రజలకు 240 గంటల పాటూ వీసా ఫ్రీ ప్రయాణం
ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం
15 ఏండ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ నిషేధం!