China visa free | డ్రాగన్ దేశం చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 55 దేశాలకు చెందిన ప్రజలకు 10 రోజుల పాటు వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించే వీలు కల్పించింది (China visa free). ఈ మేరకు చైనా కీలక ప్రకటన చేసింది.
చైనా విడుదల చేసిన జాబితాలో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ వంటి దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 240 గంటల పాటు (10 రోజులు) వీసా లేకుండానే చైనా మొత్తం చుట్టేయొచ్చు. ఈ పద్ధతి ద్వారా చైనాకు వచ్చే ప్రయాణికుల వద్ద ధ్రువీకరించిన తేదీలతో ఇతర దేశాలకు వెళ్లే ఇంటర్లైన్ టికెట్లు, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ సమయంలో వారు పర్యాటక ప్రదేశాలతోపాటు.. ఫ్యామిలీ ట్రిప్, వ్యాపార కార్యకలాపాలను కూడా కొనసాగించొచ్చు. కానీ, విద్య, పని, న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం సరైన వీసాతో ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి రానుంది.
Also Read..
ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం
15 ఏండ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ నిషేధం!
అమెరికా-చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం