వాషింగ్టన్: చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దీనిని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, తాను ఆమోదించవలసి ఉందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. ఇరు దేశాల ప్రతినిధులు లండన్‌లో రెండు రోజులపాటు జరిపిన చర్చలు ముగిసిన అనంతరం ఆయన ఈ పోస్ట్ చేశారు.
ఫుల్ మేగ్నెట్స్, అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్‌ను చైనా ఎగుమతి చేస్తుందని చెప్పారు. చైనా విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుకోవచ్చునని, అది తనకు సంతోషకరమని తెలిపారు.