Gold Card | అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 (Investor visa) స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు.
తాజాగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించి వెబ్‌సైట్‌ను ట్రంప్ ప్రారంభించారు. ‘ఐదు మిలియన్ డాలర్లకు, ట్రంప్ కార్డ్ వస్తోంది..!’ అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు పెట్టారు. అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది మంది కాల్ చేసి.. ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారని అందులో పేర్కొన్నారు. అయితే, గోల్డ్ కార్డ్ ఇంకా కొనుగోలుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి వ్యక్తిగత వివరాలను నమోదుకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ట్రంప్ కార్డు (Trump Card) లేదా గోల్డ్ కార్డు కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు trumpcard.gov అనే వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అప్లై చేసే వారి పేరు, ప్రాంతం, ఈ-మెయిల్ సహా ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
పౌరసత్వ కార్డుల ద్వారా వేగంగా జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నారు. ఈ క్రమంలో ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫర్లను ప్రకటించారు. ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డు ఇస్తారు. గోల్డ్ కార్డులను అమ్మనున్నామని, 5 మిలియన్ల డాలర్లకే ఆ కార్డును ఇవ్వనున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్డుల అమ్మకం ద్వారా తమ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరచాలని అధ్యక్షుడు భావిస్తున్నారు. అర్హత కలిగిన విదేశీయులకు ఈ కార్డులను అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ గోల్డ్ కార్డు వెంటనే అమెరికా పౌరసత్వాన్ని కల్పించకపోయినప్పటికీ.. దాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుంది.
Also Read..
Muhammad Yunus | హసీనాను అడ్డుకోమని ప్రధాని మోదీని కోరా.. కానీ : మహమ్మద్ యూనస్
China visa free | చైనా కీలక నిర్ణయం.. 55 దేశాల ప్రజలకు 240 గంటల పాటూ వీసా ఫ్రీ ప్రయాణం
ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం