ICE Protesters | అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజిలిస్‌లో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. వలసల పట్ల అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. ఆస్టిన్, న్యూయార్క్, షికాగో, సియాటెల్, డాలస్, కెంటకీ, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, డాలస్, బోస్టన్, పోర్ట్‌ల్యాండ్, ఫిలడెల్ఫియా, సియాటెల్, అట్లాంటా, లాస్ వెగాస్ తదితర నగరాల్లో నిరసనకారులు ఐస్ దాడులకు వ్యతిరేకంగా (ICE Protesters) ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు అమెరికా వ్యాప్తంగా విస్తరించి తీవ్ర రూపం దాల్చాయి.
షికాగో (Chicago)లో వెయ్యి మందికి పైగా నిరసనకారులు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దేశ బహిష్కరణ చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈస్ట్ మన్రో స్ట్రీట్‌లో నిరసలను తెలుపుతున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 66 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు కారు నిరసనకారులపైకి దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
During the protest against ICE in Downtown Chicago earlier today, a vehicle was caught on video nearly striking multiple pedestrians and a cyclist. Protesters can be seen briefly pursuing and hitting the car before it sped away from the scene without stopping. #chicago… pic.twitter.com/UcJe4xDPEm
— CHICAGO CRITTER (@ChicagoCritter) June 11, 2025
నిరసనలెందుకంటే?
ఈ నెల 6న ఐస్ ఏజెంట్లు లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల ఏరివేత కోసం దాడులు నిర్వహించడంతో వారికి మద్దతుగా వలసదారుల నిరసనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజు పలు హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఐస్ సోదాలు జరిపింది. లాటిన్ దేశాల వలసదారుల కోసం ఐస్ ఏజెంట్లు సోదాలు చేశారని నిరసనకారులు ఆరోపించారు. సాయంత్రానికల్లా వందలాది మంది నిరసనకారులు ఫెడరల్ భవనం బయట గుమికూడి ర్యాలీ నిర్వహించారు. కాలిఫోర్నియా సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ అధ్యక్షుడితో సహా వంద మందినిపైగా పోలీసులు అరెస్ట్ చేయడంతో జూన్ 7 నుంచి నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లాస్ఏంజెలెస్లోని డౌన్‌టౌన్ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో అక్కడ పరిమిత కర్ఫ్యూ విధించారు.
ఆందోళనకారులకు ట్రంప్ హెచ్చరికలు..
మరోవైపు కొన్ని చోట్ల ఆందోళనకారులు ముసుగులు ధరించి, మెక్సికో జాతీయ పతాకాలను చేత పట్టుకొని ఆందోళనలు నిర్వహించారు. న్యూయార్క్‌లో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న అమెరికా సైన్యం 250 వార్షికోత్సవం నేపథ్యంలో ఆందోళనకారులను ట్రంప్ హెచ్చరించారు. నిరసనలు చేయాలనుకొనేవారు భారీ బలగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు కాలిఫోర్నియాలో బలగాల మోహరింపును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే బలగాల మోహరింపును అడ్డుకోవడానికి జడ్జి నిరాకరించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
యాపిల్ స్టోర్ లూటీ
మరోవైపు లాస్ ఏంజిలిస్‌లో సోమవారం రాత్రి కొందరు నిరసనకారులు మాస్కులు ధరించి హఠాత్తుగా అద్దాలు పగులగొట్టి యాపిల్ సహా పలు కంపెనీల షాపుల్లోకి చొరబడి లూటీలకు ప్రయత్నించారు. ఆయా షాపుల భవనాలపై నిరసన రాతలు రాశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడం, దుకాణాలకు నష్టం జరగడంతో లాస్ ఏంజిలిస్ మేయర్ కరెన్ బాస్ నగరంలో పాక్షిక కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read..
అట్టుడుకుతున్న అమెరికా.. ‘ఐస్’ వ్యతిరేక ఆందోళనలు ఉధృతం
Muhammad Yunus | హసీనాను అడ్డుకోమని ప్రధాని మోదీని కోరా.. కానీ : మహమ్మద్ యూనస్