ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 08:37:09

చ‌రిత్ర సృష్టించిన యూఏఈ.. నింగికెగిరిన‌ మార్స్ ప్రోబ్

చ‌రిత్ర సృష్టించిన యూఏఈ.. నింగికెగిరిన‌ మార్స్ ప్రోబ్

హైద‌రాబాద్‌: అంత‌రిక్ష రంగంలో యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ దేశం చ‌రిత్ర సృష్టించింది. మార్స్ గ్ర‌హానికి ఆర్బిటార్‌ను పంపిన తొలి అర‌బ్ దేశంగా నిలిచింది. ఇవాళ తెల్ల‌వారుజామున 1.58 నిమిషాలకు ఈ ప్ర‌యోగం జ‌రిగింది.  మార్స్ గ్ర‌హానికి వెళ్తున్న రాకెట్‌లో.. హోప్‌ ఆర్బిటార్ ఉన్న‌ది.  అయితే ప్ర‌యోగం చేసిన గంట త‌ర్వాత వ్యోమ‌నౌక నుంచి ప్రోబ్ ఆర్బిటార్ వేరైంది.  మితుషుబిషి హెవీ ఇండ‌స్ట్రీస్ ఈ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించింది. ప్రయోగం జ‌రిగిన కొన్ని నిమిషాల్లో ప్రోబ్ టెలికాం సిస్ట‌మ్‌ను సెట‌ప్ చేశారు. ప్రోబ్ ఆర్బిటార్ సిగ్న‌ల్స్ కూడా అందించింది. దుబాయ్‌లోని అల్ క‌వ‌నీజ్ వ‌ద్ద ఉన్న మిష‌న్ కంట్రోల్ టీమ్‌కు ఆ సిగ్న‌ల్స్ కూడా అందాయి. 

అల్ అమాల్ లేదా ద హోప్ అనే ఆర్బిటార్‌ను .. అంగార‌క గ్ర‌హానికి పంపిస్తున్నారు. ఆ ప్రోబ్ బ‌రువు 1.3 ట‌న్నులు.  జ‌పాన్‌లో ఉన్న త‌నెగాషిమా స్పేస్‌పోర్ట్ నుంచి దీన్ని ప్ర‌యోగించారు. హెచ్‌-2ఏ రాకెట్ ద్వారా ఈ ప్ర‌యోగం జ‌రిగింది.  దీని కోసం ఎమిరేట్స్ ప్ర‌భుత్వం 735 మిలియ‌న్ల దీర‌మ్‌ల‌ను ఖ‌ర్చు చేసింది.  ఆరేళ్లుగా ఎమిరేట్స్ ప్ర‌భుత్వం ఈప్రాజెక్టు కోసం కృషి చేస్తున్న‌ది.  మొత్తం 135 మంది ఎమిరేట్ ఇంజినీర్లు, సైంటిస్టులు, ప‌రిశోధ‌కులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు.  రోద‌సి నుంచి ప్రోబ్ ఆర్బిటార్ సిగ్న‌ల్ పంప‌డంతో.. దుబాయ్‌లో ఆనందోత్స‌హాలు వెల్లువెరిశాయి. హోప్ ప్రోబ్‌కు సోలార్ ప్యానెల్స్‌ను అమ‌ర్చారు. ఆ ప్యాన‌ల్స్‌.. బ్యాట‌రీల‌ను ఛార్జ్ చేస్తాయి. వాటితోనే ఆ ప్రోబ్ సుమారు 495,000,000 కిలోమీట‌ర్లు జ‌ర్నీ చేయ‌నున్న‌ది.   
logo