Turkey | వాయువ్య టర్కీ (Turkey)లోని ప్రముఖ స్కీ రిసార్ట్ (Ski Resort)లోని హోటల్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి సంఖ్య 76కి పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాయపడిన దాదాపు 51 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బోలు ప్రావిన్స్‌లోని కర్తాల్కాయ రిసార్ట్‌లోని 12 అంతస్తుల గ్రాండ్ కర్తాల్ హోటల్ (Grand Kartal hotel) రెస్టారెంట్లో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో 234 మంది హోటల్లో ఉన్నారు.
Also Read..
Turkey | స్కీ రిసార్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 66 మంది సజీవ దహనం..!
Donald Trump: చైనా దిగుమతులపై 10 శాతం పన్ను విధించనున్న అమెరికా