Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మాటతీరుతో మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఓ జర్నలిస్ట్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు హాట్‌టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అధ్యక్షుడి తీరును ఖండిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వ్యంగ్యంగా స్పందించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించాలని అనుకుంటున్నారా..? అంటూ ట్రంప్‌ను విలేకరు ప్రశ్నించారు. దీనికి ఆయన ‘నన్ను అక్కడికి ఈదుకుంటూ వెళ్లమంటారా..?’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
What a nasty piece of shit:
Reporter: “Do you have a plan to go visit the site?”
Trump: “I have a plan to visit, not the site. Because you tell me, what’s the site? The water? You want me to go swimming?”
— CALL TO ACTIVISM (@CalltoActivism) January 30, 2025
ఇక ఇదే సమావేశంలో గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ అనుసరించిన పాలసీ విధానాలను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. వారివల్లే విమాన ప్రమాదం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఆకాశ భద్రతా ప్రమాణాల విషయంలో ఒబామా, బైడెన్ రాజీపడ్డారని ఆరోపించారు. మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో నియంమించిందని ఆరోపించారు. తాను మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు.
Also Read..
PM Modi | అమెరికా ప్రజలకు సంఘీభావంగా నిలబడతాం.. వాషింగ్టన్ డీసీ విమాన ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
విమానం – హెలికాప్టర్ ఢీ.. 67 మంది దుర్మరణం