PM Modi | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్ (Washington)లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ (US Army helicopter) ఢీకొన్నాయి. అనంతరం ఆ రెండు సమీపంలోని నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వాషింగ్టన్ డీసీ (Washington DC)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో అమెరికా ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామని ప్రధాని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ట్వీట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
విమానం – హెలికాప్టర్ ఢీ.. 67 మంది దుర్మరణం
కాన్సాస్‌లోని విచిట నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రాంతీయ విమానం రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే 33పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేకు అతి సమీపంలో, పోటోమాక్ నదిపైన ఎదురుగా ఆర్మీ శిక్షణ హెలికాప్టర్ రావడంతో రెండూ ఢీకొన్నాయి. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్ ముక్కలయ్యి పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
హెలికాప్టర్ సైతం తలకిందులుగా నేలకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు సైన్యం ధ్రువీకరించింది. వీరందరూ మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తున్నది. మృతుల్లో అమెరికా, రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు ఉన్నారు. కాగా, అమెరికాలో గత 24 ఏండ్లలో ఎక్కువ మంది మరణాలకు కారణమైన విమాన ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Donald Trump | వాషింగ్టన్లో విమాన ప్రమాదం.. ఒబామా, బైడెన్ విధానాలే కారణం: డొనాల్డ్ ట్రంప్
విమానం – హెలికాప్టర్ ఢీ.. 67 మంది దుర్మరణం
H-1B Visa | అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణలు.. రెండేండ్ల కాలానికే హెచ్-1బీ వీసా!