విమానం – హెలికాప్టర్ ఢీ.. 67 మంది దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 67 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతయ్యింది.
- అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
- మృతుల్లో ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు
- వైట్‌హౌజ్‌కు అతి సమీపంలో దుర్ఘటన
అర్లింగ్టన్, జనవరి 30: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. వాషింగ్టన్‌లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 67 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతయ్యింది. కాన్సాస్‌లోని విచిట నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రాంతీయ విమానం రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే 33పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేకు అతి సమీపంలో, పోటోమాక్ నదిపైన ఎదురుగా ఆర్మీ శిక్షణ హెలికాప్టర్ రావడంతో రెండూ ఢీకొన్నాయి. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్ ముక్కలయ్యి పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
హెలికాప్టర్ సైతం తలకిందులుగా నేలకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు సైన్యం ధ్రువీకరించింది. వీరందరూ మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తున్నది. మృతుల్లో అమెరికా, రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు ఉన్నారు. కాగా, అమెరికాలో గత 24 ఏండ్లలో ఎక్కువ మంది మరణాలకు కారణమైన విమాన ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు.
వైట్‌హౌజ్‌కు మూడు మైళ్ల దూరంలో..
వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్, క్యాపిటల్ భవనానికి కేవలం మూడు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రపంచంలో అత్యంత నియంత్రణ కలిగిన గగనతలంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. రన్‌వేకు 2,400 అడుగుల దూరంలో, భూమికి 400 అడుగుల ఎత్తులో, గంటకు 140 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు విమానంలోని రేడియో ట్రాన్స్‌పాండర్ డాటాను బట్టి తెలుస్తున్నది. ‘మీకు ఎదురుగా విమానం కనిపిస్తున్నదా?’ అని హెలికాప్టర్ పైలట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అడుగుతుండగానే ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటనతో అమెరికా దుఃఖంలో మునిగిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఎయిర్ కంట్రోలర్ల ఎంపికలో మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్ అవలంభించిన విధానాల వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

