Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు, వసలదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. వేల సంఖ్యలో వసలదారులను ప్రత్యేక విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కంటే అక్రమ వలసదారులతోనే (illegal immigration) ముప్పు ఎక్కువగా ఉందన్నారు. పుతిన్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో రాసుకొచ్చారు. ‘పుతిన్ గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన దేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్ లార్డ్స్, మర్డర్స్, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలి. అప్పుడే మనకు ఐరోపా (Europe) లాంటి పరిస్థితి ఉండదు’ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
US President Donald Trump posts, “We should spend less time worrying about Putin, and more time worrying about migrant rape gangs, drug lords, murderers, and people from mental institutions entering our Country – So that we don’t end up like Europe!” pic.twitter.com/7kREeruf9h
— ANI (@ANI) March 3, 2025
Also Read..
Oscar Awards | వేశ్య కథకు అవార్డుల పంట.. తక్కువ బడ్జెట్‌తో విడుదలై రికార్డులు కొల్లగొట్టిన అనోరా
Zelensky vs Donald Trump | శిఖరాగ్ర చర్చల్లో యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్-జెలెన్స్కీ మధ్య మాటల తూటాలు