Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత్ సహా పలు దేశాలకు చెందిన వారిని స్వదేశాలకు తరిమేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ యంత్రాంగం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక వలసదారులపై కఠిన చర్యలు చేపట్టింది.
అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికిపైగా వలసదారులకు (Temporary Status for Immigrants) తాత్కాలిక నివాస హోదాను రద్దు చేసింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన 5,32,000 మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది. 2022 అక్టోబరు తర్వాత ఆ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చినవారికి ఈ బహిష్కరణకు గురవుతున్నారు.
Also Read..
Donald Trump | ట్రంప్ మరో సంచలనం.. విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం
గాజాలో మరింత భూభాగం ఆక్రమించండి