వాషింగ్టన్, మార్చి 21: ప్రపంచంలోనే తొలిసారిగా ఆరో తరం ఫైటర్ జెట్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దీనిని ఎఫ్-47గా పిలవనున్నట్టు, బోయింగ్ సంస్థ దీనిని నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రపంచంలోని మరే జెట్ విమానం దీని దరిదాపుల్లోకి కూడా రాదని అన్నారు. వేగం నుంచి యుక్తి వరకు, పేలోడ్ నుంచి సామర్థ్యం వరకు దీనికి సాటిలేదని ప్రశంసించారు. ఎఫ్-47 అన్నది అందమైన నంబరని అన్నారు. ఇప్పటివరకు ఐదో తరం జెట్‌గా ఉన్న ఎఫ్-22 రాప్టర్ స్థానాన్ని భవిష్యత్‌లో ఇది భర్తీ చేస్తుందని చెప్పారు.