Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖ (US Education Department)ను మూసివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.
అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖనే మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. గురువారం వైట్‌హౌస్ (White House)లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకాలు చేశారు. దీన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ శాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు విద్యాశాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Tesla Cars | టెస్లాపై దాడి చేస్తే 20 ఏండ్లు జైలు శిక్ష తప్పదు.. ట్రంప్ కీలక హెచ్చరికలు
H1-b Visa | హెచ్-1బీ పాత రికార్డులు ఉండవిక.. వీసాల ప్రొగ్రామ్‌లో ట్రంప్ కీలక మార్పులు
Donald Trump | భారత్ సుంకాలు తగ్గిస్తుందని భావిస్తున్నా : డొనాల్డ్ ట్రంప్