గాజా : ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెట్టకపోతే గాజాలోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ శుక్రవారం తమ దేశ సైన్యాన్ని(ఐడీఎఫ్) ఆదేశించారు. అదే సమయంలో ప్రభావిత ప్రాంతాల నుంచి పాలస్తీనియన్లను ఖాళీ చేయాలని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి నిరాకరిస్తున్నంత కాలం హమాస్ మరిన్ని భూభాగాలు కోల్పోతూనే ఉంటుందని, అవన్నీ తమ దేశంలో విలీనమవుతాయని కట్జ్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో ని అమెరికా రాయబారి చొరవ తీసుకొని ఇజ్రాయెల్‌కు చెందిన చనిపోయిన, సజీవ బందీలను తమకు అప్పగించేలా కృషి చేయాలని ఆయన కోరారు. తాజా పరిస్థితులతో పాలస్తీనియన్లు ఇత ర ప్రాంతాలకు పారిపోతున్నారు.