Pak-Afghan | పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ (Pak-Afghan) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఘర్షణల తర్వాత పాకిస్థాన్‌లో టమాటా ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర (Tomato Prices) 700 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం.
పాక్- అఫ్గాన్ మధ్య ఏటా 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని.. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా, వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలిపారు. అఫ్గాన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు.
Also Read..
తక్షణ కాల్పుల విరమణకు పాక్, అఫ్ఘాన్ అంగీకారం
Museum | ఫ్రాన్స్‌లోని మరో మ్యూజియంలో భారీ చోరీ.. బంగారు, వెండి నాణేలు అపహరణ
Golconda Diamond | గోల్కొండ వజ్రాన్ని తాకని లూవ్రా దొంగలు!.. శాపగ్రస్థమైనదనే వదిలేశారా?