Museum | ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం (Museum) లూవ్రా (Louvre)లో భారీ చోరీ (robbery) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఫ్రాన్స్‌లోని మరో మ్యూజియం (French museum)లో దోపిడీ జరిగింది.
ఫ్రాన్స్‌లోని ‘ది మైసన్ డెస్ లుమైరేస్’ (The Maison des Lumires) అనే మ్యూజియంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు (gold and silver coins stolen) గురయ్యాయి. వీటి విలువ €90,000 గా అంచనా. మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరవగా.. లోపల అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లువ్రా మ్యూజియంలో చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read..
Golconda Diamond | గోల్కొండ వజ్రాన్ని తాకని లూవ్రా దొంగలు!.. శాపగ్రస్థమైనదనే వదిలేశారా?
దీపావళి పేరుతో ఆసియాన్ సదస్సుకు డుమ్మా!.. ట్రంప్‌కు ముఖం చాటేస్తున్న మోదీ?
భారత డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. యూఎస్‌లో ముగ్గురి మృతి