కాలిఫోర్నియా: జషన్‌ప్రీత్ సింగ్(21) అనే భారత ట్రక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో నిందితుడితో సహా పలువురు గాయపడ్డారు.
సాన్ బెర్నార్డినో కౌంటీ ఫ్రీ వేలో నిందితుడు నడుపుతున్న ట్రాక్టర్ ట్రైలర్ ఎస్‌యూవీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి దవాఖానలో పరీక్షించగా అతడు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. నిందితుడు అక్రమ వలసదారు కావడంతో అతడిపై ఇమిగ్రేషన్ డిటెయినర్ను జారీ చేసింది.