దోహా : పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంలో శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
కాల్పుల విరమణ కొనసాగింపు, దాని అమలును నమ్మదగిన రీతిలో తనిఖీ చేయడం కోసం సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించాయి. ఖతార్ విదేశాంగ శాఖ ఆదివారం ఈ వివరాలను వెల్లడించింది. దాదాపు వారం పాటు ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో, పదుల సంఖ్యలో మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే.