Today History: చిన్నారులకే కాకుండా పెద్దవాళ్లను కూడా అలరించిన కార్టూన్లలో ‘టిన్టిన్’ ప్రత్యేకమైనది. ఈ కార్టూన్ క్యారెక్టర్ ప్రారంభమై నేటికి సరిగ్గా 93 ఏండ్లు పూర్తయ్యాయి. తొలిసారిగా ఈ కార్టూన్ బెల్జియన్ వార్తాపత్రికలో ప్రచురితమైంది. టిన్టిన్ మొదటి కార్టూన్ సిరీస్ పేరు ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్టిన్’. ఒక సాహసోపేతమైన రిపోర్టర్, తన కుక్క స్నోవీతో ప్రపంచాన్ని చుట్టేయడంలో చూపిన తెగువను ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.
టిన్టిన్ పాత్ర బెల్జియన్ కార్టూనిస్ట్ జార్జెస్ రెమీ అలియాస్ హెర్జ్ ఆలోచనల నుంచి పుట్టింది. హెర్జ్ 1983 లో తన 76వ ఏట మరణించాడు. అతడి మరణానంతరం కూడా టిన్టిన్ కామిక్స్‌కి ఆదరణ తగ్గలేదు. టిన్టిన్ పాత్ర పదునైన తెలివి, నిజాయితీ, మర్యాద, దయకు మారుపేరుగా నిలిచింది. తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపద్బంధువుగా నిలుస్తాడు. అతడి పరిశోధనాత్మక రిపోర్టింగ్, వేగంగా ఆలోచించే సామర్థ్యం మనల్ని కట్టిపడేస్తాయి.
టిన్టిన్ మొదటి కామిక్ పుస్తకం ‘టిన్టిన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ది సోవియట్స్’ 1930 లో ప్రచురితమైంది. అప్పటి నుంచి టిన్టిన్ కామిక్స్ 100కి పైగా భాషల్లో ప్రచురితమై 35 కోట్లకు పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి. మానవులు చంద్రుడిపై కాలు పెట్టడానికి 15 ఏండ్ల ముందే అంటే.. 1954 లో టిన్టిన్ మ్యాగజైన్, కామిక్ పుస్తకం చంద్రునిపై అన్వేషకుల నిష్క్రమణ గురించి ప్రస్తావించాయి. చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 లో అడుగు పెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
టిన్టిన్పై చాలా సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో ఐదు చిత్రాలు హెర్జ్ జీవించి ఉన్నప్పుడే విడుదలయ్యాయి. తన మరణానంతరం మరే ఇతర కళాకారుడు టిన్టిన్పై కామిక్స్ చేయకూడదని తన చివరి కోరికగా హెర్జ్ చెప్పారు. టిన్టిన్లో మొత్తం 24 కామిక్స్ ముద్రించగా.. చివరి కామిక్స్ 1986లో వచ్చాయి.
ఇవాళ ప్రపంచ హిందీ దినోత్సవం
1987: ప్రపంచాన్ని చుట్టే మొదటి ఫెర్రీ యాత్ర ముంబైలో పూర్తి
1975: నాగ్‌పూర్‌లో తొలి ప్రపంచ హిందీ సదస్సు
1974: నటుడు హృతిక్ రోషన్ జననం
1946: లండన్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తొలి సమావేశం, 51 దేశాల ప్రతినిధులు హాజరు
1940: భారతీయ గాయకుడు, శాస్త్రీయ సంగీతకారుడు కేజే యేసుదాస్ జననం
1912: భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయిన చక్రవర్తి జార్జ్ V, క్వీన్ మేరీ దంపతులు
1886: భారతీయ విద్యావేత్త, ఆర్థికవేత్త జాన్ మథాయ్ జననం
1863 : లండన్‌లో తొలి భూగర్భ మెట్రో రైలు ప్రారంభం
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..