Worlds Safest Country | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో (Worlds Safest Country) మనకంటే (భారత్) దాయాది పాకిస్థాన్ మెరుగైన స్థానంలో నిలిచింది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ (Numbeo Safety Index) ప్రకారం.. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ (55.7 సేఫ్టీ స్కోర్) స్థానంలో ఉండగా, పాక్ 65వ (56.3 సేఫ్టీ స్కోర్) స్థానంలో నిలిచింది.
నంబియో భద్రతా సూచిక 147 దేశాలతో తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వతాల్లో ఉన్న చిన్న యూరోపియన్ దేశమైన అండోరా (84.7 సేఫ్టీ స్కోర్) తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ (84.5 సేఫ్టీ స్కోర్), ఖతార్ (84.2 సేఫ్టీ స్కోర్), తైవాన్ (82.9 సేఫ్టీ స్కోర్) , ఒమన్ (81.7 సేఫ్టీ స్కోర్) దేశాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదు దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత బలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఇండెక్స్ డేటా పేర్కొంది. ఆయా దేశాల్లో భద్రతా పరిస్థితులు, నేరాల రేటు, ప్రజల జీవన ప్రమాణాలు పరిగణనలోనికి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్లో అమెరికా -89, బ్రిటన్ -87, చైనా -15, శ్రీలంక-59, బంగ్లాదేశ్-126 ర్యాంకులు పొందాయి. అమోన్ 147వ స్థానంలో నిలిచింది.
Also Read..
Air India | మా విమానాల ఇంధన సరఫరా వ్యవస్థలో ఎలాంటి సమస్యలూ లేవు : ఎయిర్ ఇండియా
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 19 రోజుల్లో 3.21 లక్షల మంది దర్శనం