Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి (Republican presidential candidate) డొనాల్డ్ ట్రంపే (Donald Trump) గెలుపొందారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువగా ఉన్నారు. ఆయన 247 ఎలక్టోరల్ ఓట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ (270) వైపు దూసుకెళ్తున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాత్రం కేవలం 214 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో 95 శాతం ట్రంపే గెలుస్తారని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది.
కీలకమైన స్వింగ్ స్టేట్స్లో సైతం ట్రంపే గెలిచారు. తాజా సమాచారం ప్రకారం నార్త్ కరోలినా తర్వాత జార్జియాలోనూ ట్రంప్ విక్టరీ కొట్టారు. మరికొన్ని స్వింగ్ స్టేట్స్లో ట్రంపే ముందంజలో ఉన్నట్లు తెలిసింది. ట్రంప్‌కు 51.2 శాతం, హారిస్‌కు 47.2 శాతం ఓట్లు పోలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్తి ఫలితాలు వెలుబడేందుకు చాలా సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం అందుతున్న రిజల్ట్స్ ప్రకారం .. ట్రంప్ దిశగా ఓటర్లు మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక తాజా ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ గెలవడంతో.. ఆ పార్టీ మద్దతుదారులు ఆనందోత్సహాల్లో తేలుతున్నారు. వాషింగ్టన్ డీసీ సహా తదితర ప్రాంతాల్లో.. ట్రంప్ పేరుతో ఉన్న ప్లకార్డులను పట్టుకుని వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
#WATCH | Washington, DC: The group ‘Sikh Americans for Trump’ dances to the tunes of dhol as Republican presidential candidate #DonaldTrump leads in the #USElections2024.
Republicans have won control of the U.S. Senate with victories in West Virginia and Ohio on Tuesday,… pic.twitter.com/qM329H2cBm
— ANI (@ANI) November 6, 2024
రిపబ్లికన్లదే అమెరికా సేనేట్..
అమెరికా సేనేట్ (US Senate)లో మళ్లీ రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్దల సభ సేనేట్‌లో ట్రంప్ పార్టీ దూసుకెళ్తున్నది. 50 సీట్ల మార్క్‌ను ఆ పార్టీ దాటేసింది. ఇంకా అనేక చోట్ల కౌంటింగ్ జరుగుతున్నది. మరోవైపు సెనేట్‌లో డెమోక్రాట్లు తమ మెజారిటీని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. రిపబ్లికన్ల స్థానాల్లో విక్టరీ కోసం డెమోక్రాట్లు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సేనేట్ ఈసారి రిపబ్లికన్ వశం అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2021 నుంచి సేనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక సేనేట్ నేతగా కొత్త లీడర్‌ను ఎన్నుకోనున్నారు. డెమోక్రాట్లు 40 స్థానాల్లో, రిపబ్లికన్లు 51 స్థానాల్లో విక్టరీ సాధించారు. ఒక స్థానం ఇండిపెండెంట్‌కు వెళ్లింది. మరో 8 స్థానాల ఫలితాలు వెలుబడాల్సి ఉన్నది. వెస్ట్ వర్జీనియా, ఓహియాతో పాటు నెబ్రస్కాలో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆయన పార్టీకి సేనేట్‌లో మెజారిటీ కన్ఫర్మ్ అయ్యింది.
Also Read..
Raja Krishnamoorthi | ఇల్లినాయిస్లో భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి విజయం
US Elections | హోరాహోరీ పోరు.. ట్రంప్, కమల హ్యారిస్‌కు సమాన ఓట్లు వస్తే ఎలా?