ఓ యువతి కిడ్నాప్ అయింది. తనను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు. తన పని అయిపోయిందని అనుకుంది. కానీ.. తనకు వచ్చిన ఓ ఐడియా తనను కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకునేలా చేసింది. టిక్‌టాకే తనను కాపాడింది. అదేంటి… టిక్‌టాక్ ఎలా కాపాడింది తనను అని అనుకుంటున్నారా? పదండి కాస్త వివరంగా తెలుసుకుందాం.
యూఎస్‌లోని నార్త్ కరోలినాకు చెందిన 16 ఏళ్ల యువతి.. నవంబర్ 2 న మిస్ అయింది. తన తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. రెండు రోజుల కింద ఆ యువతి ఆచూకి కెంటుక్కీలో ఓ కారులో లభించింది.
అది కూడా కారులో కూర్చున్న ఆ యువతి చేసిన హాండ్ సిగ్నల్ ద్వారా. సిల్వర్ కలర్ టయోటా కారులో ఆ యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా.. ఆ యువతి.. బయట ఉన్న ఓ వ్యక్తికి హాండ్ ద్వారా సిగ్నల్ ఇచ్చింది. అది టిక్‌టాక్‌కు చెందిన సిగ్నల్. నేను ప్రమాదంలో ఉన్నాను. నాకు సాయం కావాలి.. అనే విధంగా ఆ యువతి టిక్‌టాక్‌లో వాడే సిగ్నల్‌ను అక్కడ చేసింది. దీంతో బయట ఉన్న వ్యక్తికి అనుమానం వచ్చి వెంటనే 911కు కాల్ చేసి.. ఆ కారును ఫాలో అయ్యాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కారును అడ్డగించి.. ఆ యువతిని కాపాడి.. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని 61 ఏళ్ల జేమ్స్ హెర్బెర్ట్ బ్రిక్‌గా గుర్తించారు. తనను నార్త్ కరోలినాలో కిడ్నాప్ చేసి టెన్నెస్సీ, కెంటుక్కీ మొత్తం తిప్పాడని తెలిపింది. ఓహియోలో తనకు తెలిసిన వాళ్లను కలిసినప్పుడు.. తనను చూసి.. ఈ అమ్మాయి మైనర్ అని.. మిస్సింగ్ రిపోర్ట్ కూడా తన మీద నమోదు అయిందని ఆ వ్యక్తి చెప్పారని.. దీంతో రూట్ మార్చి తనను వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నించాడని ఆ యువతి పోలీసులకు తెలిపింది.
చివరకు ఓ మోటరిస్ట్ సాయంతో.. టిక్‌టాక్ సిగ్నల్స్ చేయగా.. తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో గృహ హింస, హెల్ప్ చేయండి, నేను ప్రమాదంలో ఉన్నాను.. అనే వాటిని సూచించే విధంగా హాండ్ సిగ్నల్స్ పాపులర్ అయ్యాయి.
టిక్‌టాక్‌లో కూడా ఈ హాండ్ సిగ్నల్స్‌కు సంబంధించిన వీడియో బాగా పాపులర్ అవడంతో టిక్‌టాక్‌ను ఉపయోగించి ఆ యువతి మొత్తానికి కిడ్నాపర్ నుంచి తప్పించుకోగలిగింది.
తనను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహానికి తరలించడం కోసం ప్రయత్నించానని.. ఆ యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
DOMESTIC VIOLENCE SIGNAL
— Halton Police (@HaltonPolice) August 24, 2021
Isolation can increase the risk of violence at home. Use this discrete gesture during a video call to show you need help:
1. Hold hand up with palm facing other person.
2. Tuck thumb into palm.
3. Fold fingers down over thumb. pic.twitter.com/gsIgSbXOmc
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలను మీరెప్పుడైనా చూశారా..?