Harshit Rana : స్వదేశంలో టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలేలా ఉంది. ఈమధ్య నిలకడగా రాణిస్తూ స్క్వాడ్‌లోకి దూసుకొచ్చిన ఆల్‌రౌండర్ హర్షిత్ రానా (Harshit Rana) మెగా టోర్నీలో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వామప్ మ్యాచ్‌లో గాయపడిన రానా ఇంకా కోలుకోకపోవడమే అందుకు కారణం. రేపటి నుంచి వరల్డ్‌కప్ షురూ కానున్నందున.. శుక్రవారం మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SuryakumarYadav) మాట్లాడుతూ రానా ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశాడు.
పదో సీజన్ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 (శనివారం) నుంచి వరల్డ్‌కప్ షురూ కానుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఆరంభం రోజే యూఎస్ఏతో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు పేసర్ హర్షిత్ రానా అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనే విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్‌లో హర్షిత్ రానా గాయపడ్డాడు. ప్రస్తుతానికైతే అతడి ఆరోగ్యం మెరుగవ్వలేదు. అలాఅనీ ప్రపంచకప్ నుంచి రానా వైదొలిగాడని చెప్పలేం. ఫిజియో అతడిని పరీక్షిస్తాడు. ఈరోజుతో మాకు రానా ఆరోగ్యంపై అప్డేట్ వస్తుంది.
Harshit Rana is a doubt for the T20 World Cup after picking up a thigh injury in India’s warm-up match against South Africa 🤕 pic.twitter.com/DkH5T6jbe4
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2026
ఒకవేళ అతడికి ఇంకా నయం కాలేదంటే అది మాకు విచారకరం. అయితే.. ఆందోళన చెందాల్సిందేమీ లేదు. రేపు యూఎస్ఏతో ఆడేందుకు ఫిట్‌గా పదకొండు మంది ఉన్నారు. కానీ, కాంబినేషన్లను బట్టే స్క్వాడ్‌లోకి రానాను తీసుకున్నాం. ఇప్పుడు అతడు అందుబాటులో లేకుంటే మార్పులు చేయక తప్పదు. ప్రస్తుతం స్క్వాడ్‌లో అవసరమైనన్ని కాకాంబినేషన్లు ఉన్నాయి. ఏదిఏమైనా రానాను మిస్ కావాల్సి వస్తే అది ఒకింత కష్టమైన విషయమే’ అని సూర్య వెల్లడించాడు.
Harshit Rana is becoming something what India has always lacked – a fast bowler who can bat. Perfect No. 8 or even No. 7 if required.
Gautam Gambhir deserves praise for sticking with him.pic.twitter.com/wd4s64aL8q
— Incognito (@Incognito_qfs) January 18, 2026
వరుసగా రెండోసారి కప్ గెలవాలనకుంటున్న టీమిండియా సన్నాహక సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 4-1తో చిత్తు చేసింది. ఈ ఐదు మ్యాచుల్లో ఆడిన రానా బంతితో, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవేళ అతడు గాయం తీవ్రత కారణంగా వరల్డ్‌కప్ ఆడకుంటే.. మరొకరిని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. సెలెక్టర్లు రిజర్వ్ ప్లేయర్‌ను ఎంపిక చేయలేదు. అయితే.. బుమ్రా, అర్స్దీప్లతో పేస్ దళం పటిష్టంగానే ఉంది. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే ఉండనే ఉన్నారు. అయినా సరే అనివార్యమైతే స్క్వాడ్‌లో మార్పులు చేసే అవకాశముంది. శనివారం సాయంత్రం 6 గంటలకు సూర్యకుమార్ సేన యూఎస్ఏతో తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
భారత టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇసాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్. వరుణ్ చక్రవర్తి.